Nani Ninnukori Movie
సినిమాలకు మూలధనమైన ప్రేమ కథలను మళ్లీ మళ్లీ చూపించినా ఏదో పాయింట్ కనెక్ట్ చేసుకొని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం సినీ నిర్మాత, దర్శకులకూ ధీమా ఉంటుంది. ఆ క్రమంలో వచ్చిన సినిమానే నిన్ను కోరి. జెంటిల్మన్, నేను లోకల్ లాంటి హిట్స్ నాని, సరైనోడుతో ఆది పినిశెట్టి, జెంటిల్మన్‌తో నివేద థామస్ మంచి జోష్ మీద ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి చేసిన తాజా సినిమా 'నిన్ను కోరి'. ప్రేమించి పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసుకొని ప్రేమించుకోవడం అనే రెండు రకాల కాన్సెప్ట్‌లతో ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శివ నిర్వాణ రూపొందించారు. రాధాకల్యాణం, అభినందన, మౌనరాగం లాంటి సినిమాల ఛాయలు నిన్నుకోరి చిత్రంలో కనిపిస్తాయి. సినిమాలకు మూలధనమైన ప్రేమ కథలను మళ్లీ మళ్లీ చూపించినా ఏదో పాయింట్ కనెక్ట్ చేసుకొని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం సినీ నిర్మాత, దర్శకులకూ ధీమా ఉంటుంది. ఆ క్రమంలో వచ్చిన సినిమానే నిన్ను కోరి. విభిన్నమైన ప్రాతలను ఎంచుకొని హిట్లు సొంతం చేసుకొంటున్న నేచురల్ స్టార్ నాని నిన్నుకోరి చిత్రంలో భగ్న ప్రేమికుడిగా నటించారు. భారీ అంచనాలతో వచ్చిన నిన్ను కోరి చిత్రం ఏ మేరకు ఆకట్టుకొన్నాయో తెలుసుకోవాలంటే కథ గురించి తెలుసుకోవాల్సిందే.
ఉమా అలియాస్ ఉమా మహేశ్వర్‌రావు (నాని) వైజాగ్ యూనివర్సిటీ స్టూడెంట్. పల్లవి ఓ కాలేజిలో చదివే స్టూడెంట్. పల్లవికి డ్యాన్స్ నేర్చుకోవాలనే కోరిక ఉంటుంది. స్వతహాగా ఉమ మంచి డ్యాన్సర్ కావడంతో పల్లవి ఆయన వద్ద డ్యాన్సర్‌గా చేరుతుంది. ఉమ, పల్లవి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. ఓ దశలో ఉమ ఏకంగా పల్లవి ఇంటిపై ఉండే పెంట్ హౌస్‌లో అద్దెకు దిగుతాడు. దాంతో పల్లవి తండ్రి, బావ (మురళీ శర్మ, పృథ్వీ)తో పరిచయం పెరుగుతుంది. పల్లవి ఇంట్లో ఓ సభ్యుడిగా మారిపోతాడు. అన్ని సక్రమంగా సాగిపోతుండగానే ఉమ ఢిల్లీ యూనివర్సిటీలో పీహెచ్‌డీ కోసం పల్లవిని వదిలేసి వెళ్తాడు. ఈలోగా పల్లవి పెళ్లి (అరుణ్)తో జరిగిపోతుంది. పల్లవి, అరుణ్ అమెరికాలో సెటిల్ అవుతారు. పీహెచ్‌డీ పూర్తి చేసుకొన్న ఉమ కూడా అమెరికాలోనే ఉద్యోగం చేస్తుంటాడు. ఓ దశలో పల్లవికి దూరమైన బాధతో ఉమ ఉద్యోగం వదిలేసి తాగుడు బానిస అవుతాడు.
Song Credits:
Movie: Ninnu Kori
Cast: Aadhi Pinisetty,Nani,Nivetha Thomas
Music Director: Gopi Sunder
Director: Shiva Nirvana Year: 2017
Adiga Adiga Telugu Lyrics:
అడిగా అడిగా ఎదలో లయనడిగా
కదిలే క్షణమా చెలి ఏదని
నన్నే మరిచా తన పేరునే తలిచా
మదినే అడిగా తన ఊసేదని
నువ్వేలేని నన్ను ఊహించలేను
నా ప్రతి ఊహలోను వెతికితే మనకథే
నీలోనే ఉన్నా నిను కోరి ఉన్నా
నిజమై నడిచా జతగా
గుండెలోతుల్లో ఉంది నువ్వేగా
నా సగమే నా జగమే నువ్వేగా
నీ స్నేహమే నను నడిపే స్వరం
నిను చేరగ ఆగిపోని పయణం
అలుపే లేని గమణం
అడిగా అడిగా ఎదలో లయనడిగా
కదిలే క్షణమా చెలి ఏదని
నన్నె మరిచా తన పేరునే తలిచా
మదినే అడిగా తన ఊసేదని
నువ్వే లేని నన్ను ఊహించలేను
నా ప్రతి ఊహలోను వెతికితే మనకథే
నీలోనే ఉన్న నిను కోరి ఉన్న
నిజమై నడిచా జతగా
Adiga Adiga English Lyrics:
Adiga adiga yedhalo layanadiga
Kadhile kshanama cheli yedhani
Nanne maricha thana perune thalicha
Madhine adiga thana oosedhani
Nuvve leni nannu oohinchalenu
Na prathi oohalonu vethikithe manakathe
Neelone unna ninu kori unna
Nizamai nadhicha jathaga
Gunde lothullo undhi nuvve ga
Na sagame na jagame nuvvega
Nee snehame nanu nadipe swaram
Ninu cheraga aagiponi payanam
Alupe leni gamanam
Adiga adiga yedhalo layanadiga
Kadhile kshanama cheli yedhani
Nanne maricha thana perune thalicha
Madhine adiga thana oosedhani
Nuvve leni nannu oohinchalenu
Na prathi oohalonu vethikithe manakathe
Neelone unna ninu kori unna
Nijamai nadhicha jathaga
Search more songs like this one
0 Comments