//stoobsugree.net/4/7308567 https://kauraishojy.com/4/7308567 కోకిలమ్మ(1983) పల్లవించవా నా గొంతులో - Saritha, Swapna and Rajeev

కోకిలమ్మ(1983) పల్లవించవా నా గొంతులో - Saritha, Swapna and Rajeev

పల్లవించవా నా గొంతులో

వినికిడి శక్తిలేని కోకిలమ్మ ఒక పనిమనిషి. తనకున్నదాంట్లో పదిమందికి సహాయం చేయాలనుకునే అనాథ. ఆమె ఉంటున్న దిగువ మధ్యతరగతి వాడలోకి గాయకుడవ్వాలనుకునే కుర్రాడు అద్దెకు వస్తాడు. తనకు వినిపించకపోయినా అతని కంఠంలోని హెచ్చుతగ్గుల కదలికల స్పర్శతో అతని పాటకు విమర్శకురా లవుతుంది. అతడికి ఆర్థికంగా సాయపడుతుంది. ఆమె చెప్పినట్టే అతను మంచి గాయకుడవుతాడు. పేరు, డబ్బు వస్తుంది. ఆమెను మర్చిపోతాడు. ఆ వాడ వదిలి కలవారింటి అల్లుడవుతాడు. కోకిలమ్మ మనసు గాయపడినా, కన్నీళ్లు రానివ్వకుండా ఆ దుఃఖాన్ని మింగేస్తుంది.

Song Credits:

చిత్రం : కోకిలమ్మ(1983) 

సంగీతం : ఎం. ఎస్. విశ్వనాథన్ 

రచన : ఆచార్య ఆత్రేయ 

గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం

పల్లవించవా నా గొంతులో Telugu Lyrics:

పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో
పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో
ప్రణయ సుధా రాధా
నా బ్రతుకు నీది కాదా

పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో


నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే
నాదన్నది ఏమున్నది నాలో
నేవేనాడొ మలిచావు ఈ రాతిని
నేనీనాడు పలకాలి నీ గీతిని

నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే
నాదన్నది ఏమున్నది నాలో
నేవేనాడొ మలిచావు ఈ రాతిని
నేనీనాడు పలకాలి నీ గీతిని

ఇదే నాకు తపమనీ ఇదే నాకు వరమని
ఇదే నాకు తపమనీ ఇదే నాకు వరమని
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది

పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో


నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని
నీ వీణకు నాదాన్ని కానా
నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన
నీకు ఈనాడు తెలిపేది నా వేదన

నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని
నీ వీణకు నాదాన్ని కానా
నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన
నీకు ఈనాడు తెలిపేది నా వేదన

ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని
ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది

పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో
ప్రణయ సుధా రాధా
నా బ్రతుకు నీది కాదా

పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో

Search more songs like this one

Post a Comment

0 Comments